Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

కంగ్టిలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

18-08-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కంగ్టిలోని లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలు, వీరత్వం, సమాజం కోసం చేసిన సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సైతం ఆయన జీవిత చరిత్ర, పోరాట పటిమపై ప్రసంగించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం తదితరులు ఉత్సాహంగా పాల్గొని సర్దార్ పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు.

Sthanikam

కంగ్టిలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కంగ్టిలోని లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలు, వీరత్వం, సమాజం కోసం చేసిన సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సైతం ఆయన జీవిత చరిత్ర, పోరాట పటిమపై ప్రసంగించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం తదితరులు ఉత్సాహంగా పాల్గొని సర్దార్ పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News