Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతున్నాయి:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

18-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్‌కల్ మండల పరిధిలోని మెటల్‌కుంట గ్రామంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కొందరు చేస్తున్న దుష్ప్రచారం నిరాధారమని అన్నారు. పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తోందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని, ఇతర పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఈ పథకాలకు చట్టబద్ధమైన భద్రత కల్పించకపోవడం వల్లే ప్రస్తుతం కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పూలమ్మ, ఇందిరమ్మ, బుజ్జమ్మ, బేగం, శశికళ, సత్యమ్మ, మధురవేణి, ఆశమ్మ, శివమ్మ, భీమమ్మ, రషీద, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతున్నాయి:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

Article Image

న్యాల్‌కల్ మండల పరిధిలోని మెటల్‌కుంట గ్రామంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కొందరు చేస్తున్న దుష్ప్రచారం నిరాధారమని అన్నారు. పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తోందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని, ఇతర పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఈ పథకాలకు చట్టబద్ధమైన భద్రత కల్పించకపోవడం వల్లే ప్రస్తుతం కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పూలమ్మ, ఇందిరమ్మ, బుజ్జమ్మ, బేగం, శశికళ, సత్యమ్మ, మధురవేణి, ఆశమ్మ, శివమ్మ, భీమమ్మ, రషీద, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News