Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ

17-08-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సానుకూలంగా స్పందించింది. తమ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ​గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బృందం దివీస్ యాజమాన్యాన్ని నేరుగా కలసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, సురక్షిత తాగునీటి కోసం వాటర్ ఫిల్టర్ల ఏర్పాటు. ఎఎమ్ఆర్ కాలనీలో కమ్యూనిటీ హాల్, గ్రామీణుల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ అందుబాటులోకి తేవడం. ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేపట్టడం. రవాణా సౌకర్యం కోసం నక్కలగూడెం రోడ్డు, గోకారం రోడ్డు ప్రాంతాలలో కల్వర్టుల నిర్మాణం. ​గ్రామ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై దివీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి సుధాకర్ సానుకూలంగా స్పందించారు. నేలపట్ల గ్రామ అభివృద్ధికి కంపెనీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు పార అనసూయ శ్యామ్, బుట్టి స్రవంతి బాలరాజు, డబ్బటి ఉపేందర్, కత్తుల సాయి, గుర్రం ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News