Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి

17-08-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం సుక్కల్తీర్థం గ్రామ శివారులో కంది పంట సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయ విస్తీర్ణధికారి సంతోష్ అధిక దిగుబడి సాధించే పద్ధతులపై అవగాహన కల్పించారు. కంది మొక్కల్లో సరైన సమయంలో ‘కొనల కత్తిరింపు’ (చిగుళ్లు గిల్లడం) చేయడం వల్ల మొక్క పైకి ఎక్కువగా పెరగకుండా పక్క కొమ్మలు విస్తరించి గుబురుగా పెరుగుతాయని తెలిపారు. దీంతో పూత, కాయల సంఖ్య పెరిగి దిగుబడి మెరుగుపడే అవకాశం ఉంటుందని వివరించారు. విత్తిన 30–45 రోజుల మధ్య మొక్క శాఖీయ ఎదుగుదల దశలో ఉన్నప్పుడు పైభాగంలోని చిగుళ్లను గిల్లాలని, అవసరాన్ని బట్టి 60–70 రోజుల మధ్య మరోసారి పక్క కొమ్మల కొనలను గిల్లవచ్చని సూచించారు. అయితే పూత దశ ప్రారంభమైన తర్వాత కొనలను కత్తిరించకూడదని, శాఖీయ ఎదుగుదల దశలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు. చిన్నపాటి యాజమాన్య పద్ధతిగా కొనల కత్తిరింపును పాటించడం ద్వారా కంది పంటలో మంచి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని సంతోష్ తెలిపారు.

Sthanikam

కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News