Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

ఉత్తమ జాతీయ గ్రంథపాలకుడిగా డా. రవికుమార్ చేగొని

16-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా. ఎస్‌.ఆర్‌. రంగనాథన్‌ 134వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథపాలకుడిగా సేవలందిస్తున్న డా. రవికుమార్ చేగొని జాతీయ ఉత్తమ గ్రంథపాలకుడిగా పురస్కారం అందుకున్నారు.

మద్రాస్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆనంద్, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి దొరస్వామి, మద్రాస్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్మ్‌స్ట్రాంగ్, కొడైకెనాల్ మదర్‌ థెరిసా విశ్వవిద్యాలయం ప్రతినిధి జానకి, మద్రాస్ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా డా. రవికుమార్ చేగొని ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

గ్రంథాలయ రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలు, విద్యార్థులకు సమాచారాన్ని చేరువ చేయడంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డా. రవికుమార్ చేగొనికి కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, గ్రంథాలయ రంగ ప్రముఖులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

Sthanikam

ఉత్తమ జాతీయ గ్రంథపాలకుడిగా డా. రవికుమార్ చేగొని

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News