Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

దోసపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలు

Updated : 16 Aug 2026 20:32 IST
As Preferred Source 1 min read
దోసపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలు

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని దోసపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు శ్రీమతి అపరంజి, భర్త సుధాకర్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని ప్రారంభించి, అపరంజి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందని అన్నారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సొంతింటి కల నెరవేరడం ప్రతి కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించే విషయమని, అపరంజి కుటుంబం నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దోసపల్లి గ్రామ సర్పంచ్ బిరాదర్ దత్తు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దోసపల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news