Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

రత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి......

రత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి......

రత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి......
16-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు పులి రత్తమ్మ, ఆమె కూతురు జ్యోతిల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మున్సిపల్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని రత్తమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమన్నారు. శనివారం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రత్తమ్మను ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి విధుల్లో ఉన్న కార్మికుల సర్వీస్ రికార్డులను పక్కనబెట్టి, జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం వల్లే ప్రాణాలకు తెగించే పరిస్థితి వచ్చిందన్నారు. 14 ఏళ్లుగా సేవలు అందిస్తున్న కూతురు జ్యోతికి కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న మున్సిపల్ యంత్రంగం, నిరుపేద కార్మికుల పొట్టకొట్టడం తగదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, రత్తమ్మ కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ బాబు, గట్ల కోటేశ్వరరావు,సంపేట ఉపేందర్, బత్తుల ఉపేందర్, సోమపొంగు రాజు, మాదాల ఉపేందర్,చీమ శ్రీను, చలిగంటి లక్ష్మణ్, నేలవెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు......

Sthanikam

రత్తమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి......

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News