Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....

16-08-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....

ఈ నెల 25న చలో కోదాడ బహిరంగ సభను విజయవంతం చేయాలి.......

హామీలు నెరవేర్చే వరకు పోరాటం.....

ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు పిలుపు.......

ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న కోదాడ వర్తక సంఘం ప్రాంగణంలో చలో కోదాడ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి సాధించుకున్నప్పటికీ, దళితుల సంక్షేమానికి ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం దళిత కుటుంబాలకు ‘అంబేద్కర్ అభయహస్తం’ కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, అసైన్డ్ భూములపై అమ్ముకునే హక్కు కల్పిస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భూమి లేని దళితులకు భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యకు సహాయం, ప్రతి మండలంలో గురుకులాల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. హామీలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్గూరి హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొల్లెపోగు స్వామి, కోదాడ మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్,యమ్. యస్. యఫ్ నాయకులు పిడమర్తి బాబురావు,ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు ఏర్పుల చిన్ని, బేడా బుడగ జంగాల అధ్యక్షులు ముత్తయ్య, రాజేష్,వంశీ,ప్రతాప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.......

Sthanikam

అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలి....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News