ఐదుగురు అరెస్ట్.. ఐదు వాహనాలు స్వాధీనం.
చిట్యాల: పారిశ్రామిక రసాయనాలను తరలిస్తున్న ట్యాంకర్ల నుంచి అక్రమంగా దారి మళ్లించి, డ్రమ్ముల్లో నిల్వచేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును చిట్యాల పోలీసులు రట్టు చేశారు. వెలిమినేడు శివారులోని రాజస్థాన్ ధాబా సమీపంలో ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కెమికల్ ట్యాంకర్లు, మూడు ఇతర వాహనాలు, రసాయనాలతో కూడిన ప్లాస్టిక్ డ్రమ్ములు, పైపులు, రవాణా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ట్యాంకర్ డ్రైవర్లతో కుమ్మక్కై రసాయనాలను తక్కువ ధరకు సేకరించి, ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు సత్యనారాయణ అలియాస్ సతీష్‌తో పాటు ఇద్దరు ట్యాంకర్ డ్రైవర్లు, ఇద్దరు కూలీలు ఉన్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వ్యవహారం వెనుక మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి