Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లిస్తున్న ముఠా అరెస్ట్.

17-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లిస్తున్న ముఠా అరెస్ట్.

స్థానికం ప్రతినిధి... చిట్యాల

ట్యాంకర్లలో రవాణా అవుతున్న పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి, డ్రమ్ముల్లో నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రెండు కెమికల్‌ ట్యాంకర్లు సహా ఐదు వాహనాలు, పారిశ్రామిక రసాయనాలతో నింపిన ప్లాస్టిక్‌ డ్రమ్ములు, పైపులు, ఇతర పరికరాలు, రవాణా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

*ట్యాంకర్ల నుంచి రసాయనాల దారి మళ్లింపు*

చిట్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెలిమినేడు గ్రామ శివారులో రాజస్థాన్‌ ధాబా వెనుక పార్కింగ్‌ స్థలంలో అనుమానాస్పదంగా నిలిపి ఉన్న వాహనాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ట్యాంకర్‌ లారీల్లో గమ్యస్థానాలకు తరలిస్తున్న సాల్వెంట్లు, ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌, మిథనాల్‌ తదితర పారిశ్రామిక రసాయనాలను మార్గమధ్యంలో కొంతమేర బయటకు తీసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

*జాతీయ రహదారి-65పై డ్రైవర్లతో కుమ్మక్కు*

ప్రధాన నిందితుడు చాపల సత్యనారాయణ అలియాస్‌ సతీష్‌ తన సహచరులతో కలిసి జాతీయ రహదారి-65పై ప్రయాణించే రసాయన ట్యాంకర్‌ డ్రైవర్లతో కుమ్మక్కయ్యేవాడని పోలీసులు తెలిపారు. ట్యాంకర్లలోని పారిశ్రామిక రసాయనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, తన ఆధీనంలోని వాహనాల్లో ఉన్న ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిల్వ చేసేవాడని పేర్కొన్నారు. అనంతరం వాటిని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

*అరెస్టయిన నిందితులు*

చాపల సత్యనారాయణ అలియాస్‌ సతీష్‌ (32) – వెల్లంకి గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.

బిపిన్‌ కుమార్‌ యాదవ్‌ (35) – ట్యాంకర్‌ డ్రైవర్‌, ఉత్తరప్రదేశ్‌.

నవీన్‌ కుమార్‌ (31) – ట్యాంకర్‌ డ్రైవర్‌, ఉత్తరప్రదేశ్‌.

రాకేష్‌ ప్రసాద్‌ (45) – కూలీ, ఖాల్చా ధాబా, చిట్యాల మండలం.

అమిత్‌ కుమార్‌ (36) – కూలీ, ఖాల్చా ధాబా, చిట్యాల మండలం.

*స్వాధీనం చేసుకున్న వాహనాలు*

బొలెరో వాహనం నం. TS-07-UN-1565

బొలెరో వాహనం నం. TS-07-UM-0626

మినీ డీసీఎం వాహనం నం. TS-10-UC-4845

కెమికల్‌ ట్యాంకర్‌ నం. MH-42-AQ-6795

కెమికల్‌ ట్యాంకర్‌ నం. MH-04-LY-8397

రసాయనాలు, పరికరాలు స్వాధీనం

పారిశ్రామిక రసాయనాలతో నింపిన పలు ప్లాస్టిక్‌ డ్రమ్ములు, రసాయనాలను తరలించేందుకు ఉపయోగించిన పైపులు, ఇతర పరికరాలు, ట్యాంకర్లకు సంబంధించిన ఇన్వాయిసులు, రవాణా పత్రాలు, ఇతర రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*మరికొందరి పాత్రపై దర్యాప్తు*

రవాణా కోసం అప్పగించిన పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయించడం ద్వారా సంబంధిత పరిశ్రమలకు ఆర్థిక నష్టం కలిగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించింది. ఈ అక్రమ రవాణా, విక్రయాల వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు నార్కట్‌పల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Sthanikam

పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లిస్తున్న ముఠా అరెస్ట్.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News