Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:31 PM

ఆర్.ఎం.పి, పి.ఎం.పి అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

17-08-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఆర్ఎంపీలు అనుభవం ఉన్నా.. పరిధి దాటొద్దు-

జిల్లా ఆర్ఎంపీల సంఘం అధ్యక్షుడు దొంతగాని రవిబాబు-

ఆర్ఎంపీలు తమ పరిధికి మించి వైద్యం చేయకుండా నిబంధనలు పాటించాలని జిల్లా ఆర్ఎంపీల సంఘం అధ్యక్షుడు దొంతగాని రవిబాబు సూచించారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర, అబార్షన్‌ కేసులను స్వయంగా చికిత్స చేయకుండా సంబంధిత విభాగాల నిపుణులైన వైద్యుల వద్దకు పంపించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించవద్దని, పరిధికి మించి వైద్యం చేసి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని అన్నారు. కొత్తగా ఆర్ఎంపీలుగా వస్తున్న వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.మండల అధ్యక్షుడు భూతం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకటప్పయ్య, అంజిరెడ్డి, సిద్ధారెడ్డి, ఉపేందర్‌, శ్రీశైలం, ఖాజా, శౌరీ, నాగరాజు, లింగయ్య, శ్రీకాంత్‌, నాని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్.ఎం.పి, పి.ఎం.పి అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News