Sthanikam - Truth Matters
Logo

ఎల్‌నినో ముప్పు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం!

Updated : 16 Oct 2026 17:17 IST
As Preferred Source 1 min read
ఎల్‌నినో ముప్పు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం!

డిసెంబరు, జనవరిలో పరిస్థితులు మరింత తీవ్రం కావొచ్చు...

ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక అధికారి దాసరి హరిచందన ఆదేశం...

ప్రతి గ్రామం, ప్రతి ఇంటికీ నీరందేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు...

రబీలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి...

నల్గొండ : ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు, పశుగ్రాసం తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందస్తు కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. రానున్న నాలుగైదు నెలల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని మూడు జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

నల్గొండ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలోని ఉదయాదిత్య భవన్‌లో శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, సాగునీరు, తాగునీటి లభ్యత, భూగర్భ జలాలు, విద్యుత్తు సరఫరా, పశుగ్రాసం తదితర అంశాలపై చర్చించారు. ఎల్‌నినో ప్రభావం డిసెంబరు చివరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరే అవకాశముందని, ఇప్పటికే జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రతి గ్రామానికి నీటి కొరత రాకుండా కార్యాచరణ...

ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా చూడటమే ప్రధాన లక్ష్యమని హరిచందన పేర్కొన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వాటి ద్వారా చివరి గ్రామం వరకు, చివరి ఇంటి వరకు నీటిని సరఫరా చేసే విధానంపై కలెక్టర్లు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి లభ్యతపై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి, నీటిని పొదుపుగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు, భవిష్యత్తులో లభించే అవకాశాలు, పనిచేస్తున్న బోర్లు, నీటిని నిల్వ చేసుకునే వనరులు, గ్రామాల్లోని వాటర్‌ ట్యాంకుల పనితీరు తదితర వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని చెప్పారు. రాబోయే నెలల్లో భూగర్భ జలాలు తగ్గిపోయినా ప్రజలకు నీరు అందించే ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.

రబీలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం...

నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రబీ సీజన్‌లో రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని ప్రత్యేక అధికారి సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. పెసర్లు, ఉలవలు, కందులు, ఇతర అనువైన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రైతు నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రబీలో సూక్ష్మసేద్య పద్ధతులైన తుంపర, బిందు సేద్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తక్కువ నీటితో అధిక ప్రయోజనం పొందే వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

పశువులకు నీరు.. పశుగ్రాసం సిద్ధం...

ఎల్‌నినో ప్రభావంతో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా గ్రామాల వారీగా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని హరిచందన ఆదేశించారు. అందుబాటులో ఉన్న పశుగ్రాస నిల్వలు, నీటి వనరులను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి తీవ్రత పెరిగేలోపు ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

విద్యుత్తు పొదుపుపై అవగాహన...

విద్యుత్తు అధికంగా వినియోగించే ప్రాంతాలు, సరఫరాలో సాంకేతిక నష్టాలను గుర్తించి విద్యుత్తు ఆదా చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రత్యేక అధికారి సూచించారు. సోలార్‌ విద్యుత్తు, సోలార్‌ బ్యాటరీలు, సౌర మోటార్లు, సూర్యగృహ వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచుల సహకారంతో రైతులకు సౌర విద్యుత్తు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.

నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం...

భూగర్భ జలాల పెంపుదలకు పెద్దఎత్తున నీటి సంరక్షణ పనులు చేపట్టాలని హరిచందన సూచించారు. వి.బి.-జి. రామ్‌జీ పథకం కింద నీటి సంరక్షణకు ఉపయోగపడే పనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో మ్యాజిక్‌ సోక్‌పిట్లు, సామూహిక సోక్‌పిట్లు, నీటి నిల్వ నిర్మాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పట్టణాల్లో వృథా నీటిని తిరిగి వినియోగించుకునే అవకాశాలను పరిశీలించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి గ్రామంలో నీటి భద్రతకు అవసరమైన వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

ఉపాధి పనుల వద్ద తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు..

వి.బి.-జి. రామ్‌జీ పథకం కింద కూలీలు పనిచేసే ప్రాంతాల్లో తాగునీరు, ఓఆర్ఎస్‌ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, నీడ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రత, నీటి కొరత కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి వారం సమీక్ష.. గ్రామస్థాయి ప్రణాళికలు...

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మండల ప్రత్యేక అధికారులు ప్రతి వారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించాలని హరిచందన ఆదేశించారు. గ్రామాల్లోని నీటి వనరులు, వ్యవసాయ పరిస్థితులు, విద్యుత్తు అవసరాలు, పశుగ్రాస లభ్యతపై సమీక్షించి గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. వీటి ఆధారంగా మండల, జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబరు, జనవరిలో పరిస్థితులు మరింత తీవ్రం కావచ్చన్న అంచనాతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

నల్గొండలో 34 శాతం తక్కువ వర్షపాతం...

నల్గొండ జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లాలో ఏడు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు, తాగునీరు, వ్యవసాయంపై ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. రైతులు వరి సాగుకు బదులుగా ఉద్యాన పంటలు, పెసర్లు, కందులు సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. నీటి సంరక్షణలో భాగంగా వి.బి.-జి. రామ్‌జీ కింద వాననీటి నిల్వ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. రబీలో పెసర్లు, ఉలవలు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తక్కువ నీటితో పంటలు పండించేందుకు అవసరమైన స్ప్రింక్లర్లు, డ్రిప్‌ పరికరాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తున్నామని చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు నిధులు కేటాయిస్తే వాటి ద్వారా ఈ పద్ధతులను మరింతగా ప్రోత్సహించవచ్చని వివరించారు. సమీక్షలో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తమ జిల్లాల్లో వ్యవసాయం, పంటల పరిస్థితి, భూగర్భ జలాలు, విద్యుత్తు, తాగునీరు, పశుగ్రాసం, సాగునీటి లభ్యత తదితర అంశాలపై వివరించారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రత్యేక అధికారికి తెలియజేశారు. స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌ కరణ్‌ రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌ హరి సింగ్‌, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలినా చింగ్థియాన్‌ మావి, వ్యవసాయ, ఉద్యాన, భూగర్భ జలాలు, విద్యుత్తు, మిషన్‌ భగీరథ, ప్రజారోగ్యం, నీటిపారుదల శాఖల అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు

Sthanikam

ఎల్‌నినో ముప్పు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి