సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని శుక్రవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జూకంటి అనిల్ కుమార్ద ర్శించుకున్నారు.శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు శ్రీ మహా సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు శ్రీకాంత్ స్వామి,సిద్ధు స్వామి,నాగయ్య స్వామి,ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సత్కరించారు.అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, శేఖర్, సందీప్తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
నల్లపోచమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందిన హైకోర్టు న్యాయమూర్తి జూకంటి అనిల్ కుమార్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి