తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంగారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం అన్ని శాఖల ఉద్యోగులు,టీఎన్జీవోయూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు,సంప్రదాయ పాటలు, ఆటపాటలతో కలెక్టరేట్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంగీత గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన బతుకమ్మ పాటలకు మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబురాల్లో పాల్గొన్నారు.విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులంతా ఒకచోట చేరి సంప్రదాయ పండుగను ఆనందంగా జరుపుకోవడంతో కలెక్టరేట్లో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ లలితాదేవి,టీజీఐఐసీ మాజీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి,టీజీవో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్,టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు,మహిళా నాయకులు,వివిధ శాఖల ఉద్యోగులు,సిబ్బంది, సాంస్కృతిక సారథి కళాకారులు,సమీప కాలనీల మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి