ప్రమాదం జరిగిందని ఫోన్ చేస్తే గుంతల్లో చిక్కుకున్న అంబులెన్స్
అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పడకేసిన రహదారి మరమ్మతులు
తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి: చెరుకు శివ కుమార్ గౌడ్
ప్రమాదం జరిగిందని, ప్రాణాలు కాపాడాలని బాధితులు అత్యవసరంగా 108 అంబులెన్స్కు ఫోన్ చేస్తే.. ఆ అంబులెన్సే ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. రోడ్ల దుస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోయే రహదారులు గుంతలమయంగా మారినా అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లు గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. బాధితులకు త్వరితగతిన వైద్యం అందించాల్సిన అత్యవసర వాహనాలే ఇలా దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రమాదాలకు గురవుతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్ల సాధారణ ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టి, వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి