నల్గొండలో అక్టోబర్ 16న నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో 2026–28 సంవత్సరానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సుంకరి భిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన భట్టపురం మధుసూదన్ రెడ్డికి మానూర్ మండల పీఆర్టీయూ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర కార్యవర్గంలో మనూరు మండలం నుంచి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికైన ఎం. మహేశ్ కుమార్, కె. ప్రసన్న కుమార్, బండి శ్రీనివాస్, వి. మేఘ్య నాయక్, ఎస్. మధుసూధన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ మానూర్ మండల అధ్యక్షుడు బర్మావత్ సర్దార్, ప్రధాన కార్యదర్శి ఎర్ర సంగారెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
పీఆర్టీయూ రాష్ట్ర కమిటీలో మనూరు మండలం నుంచి ఐదుగురు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి