నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలో శుక్రవారం దసరా పండుగ సందర్భంగా శ్రీ నల్లపోచమ్మ తల్లి టోర్నమెంట్ (బోరంచ ప్రీమియర్ లీగ్)ను నిర్వాహకులు జి. నగేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పండుగల సందర్భంగా ప్రతి ఏటా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా గ్రామ యువత అందరూ ఒకచోట చేరి ఆనందంగా గడుపుతున్నారని తెలిపారు.ఇలాంటి క్రీడా పోటీలతో యువతలో స్నేహభావం, ఐక్యత పెరుగుతాయని, పండుగల సమయంలో అందరూ కలిసి సంతోషంగా గడపడం ఆనందంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
బోరంచలో ఘనంగా బోరంచ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి