Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి డీఆర్‌డీఓ నాగిరెడ్డి.

Updated : 16 Oct 2026 19:15 IST
As Preferred Source 1 min read
నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి డీఆర్‌డీఓ నాగిరెడ్డి.

కూలీలకు ఉపాధి కల్పించాలి.

రామన్నపేట అక్టోబర్ 16 స్థానికం ప్రతినిధి :

రామన్నపేట మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఆర్‌డీఓ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. రామన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో వీవీజీ రామ్‌జీ పథకం పనుల అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతి గ్రామ పంచాయతీ నుంచి రోజుకు 40 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా సమీకరించాలని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా నీటి నిల్వకు ఉపయోగపడే పనులను ఎక్కువగా చేపట్టాలని ఆదేశించారు. కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో నీటి వనరులను అభివృద్ధి చేసే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ఎంపీడీఓ రాములు, ఎంపీవో రఫీ, ఏపీవో వెంకన్న, ఏపీఎం జానీ, టెక్నికల్ అసిస్టెంట్లు, సీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీటి నిల్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి డీఆర్‌డీఓ నాగిరెడ్డి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి