Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

భరత్ సింగ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల పంపిణీ

Updated : 16 Oct 2026 20:17 IST
As Preferred Source 1 min read
భరత్ సింగ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల పంపిణీ

వనస్థలిపురం; అక్టోబర్,16 (స్థానికం)

బిజెపి సీనియర్ నాయకుడు భరత్ సింగ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనస్థలిపురంలోని ‘రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్’లోని వృద్ధులకు అవసరమైన బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులను, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రంగారెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి బొల్గాం యశోపాల్ గౌడ్ హాజరయ్యారు. తరుణ్ ఠాకూర్, కిరణ్ కుమార్, సంప్రత్, వరుణ్ ఠాకూర్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొని వృద్ధులకు నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపకుడు పెద్దిశంకర్ మాట్లాడుతూ, భరత్ సింగ్ ఠాకూర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధుల అవసరాలను గుర్తించి, వారికి ఉపయోగపడేలా నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ మానవతా సేవలో భాగస్వాములైన బొల్గాం యశోపాల్ గౌడ్, తరుణ్ ఠాకూర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.పుట్టిన రోజులను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంతో పాటు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచే స్ఫూర్తిని కలిగిస్తుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

Sthanikam

భరత్ సింగ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల పంపిణీ

Article Image

వనస్థలిపురం; అక్టోబర్,16 (స్థానికం)

బిజెపి సీనియర్ నాయకుడు భరత్ సింగ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనస్థలిపురంలోని ‘రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్’లోని వృద్ధులకు అవసరమైన బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులను, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రంగారెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి బొల్గాం యశోపాల్ గౌడ్ హాజరయ్యారు. తరుణ్ ఠాకూర్, కిరణ్ కుమార్, సంప్రత్, వరుణ్ ఠాకూర్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొని వృద్ధులకు నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపకుడు పెద్దిశంకర్ మాట్లాడుతూ, భరత్ సింగ్ ఠాకూర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధుల అవసరాలను గుర్తించి, వారికి ఉపయోగపడేలా నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ మానవతా సేవలో భాగస్వాములైన బొల్గాం యశోపాల్ గౌడ్, తరుణ్ ఠాకూర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.పుట్టిన రోజులను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంతో పాటు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచే స్ఫూర్తిని కలిగిస్తుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి