Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ప్రజలకు చేరువగా PP9 ఛానెల్.. ఘనంగా ఐదో వార్షికోత్సవం

Updated : 16 Oct 2026 19:18 IST
As Preferred Source 1 min read
ప్రజలకు చేరువగా PP9 ఛానెల్.. ఘనంగా ఐదో వార్షికోత్సవం

ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల గొంతుకగా ముందుకు సాగుతున్న PP9 యూట్యూబ్ న్యూస్ ఛానెల్ ఐదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం నారాయణఖేడ్‌లోని కార్తికేయ రెస్టారెంట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త కృష్ణ కుమార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2021 అక్టోబర్ 16న “ఆలోచన ఆచరణలో పెడదాం” అనే నినాదంతో ప్రారంభమైన PP9 ఛానెల్ ఐదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్టి ప్రవీణ్ కుమార్‌ను ముఖ్య అతిథులు అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రజలకు నిజమైన సమాచారం అందిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన PP9 ఛానెల్ ఐదేళ్లలో మంచి గుర్తింపు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో PP9 ఛానెల్ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఐదేళ్ల ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఛానెల్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ప్రజలకు చేరువగా PP9 ఛానెల్.. ఘనంగా ఐదో వార్షికోత్సవం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి