Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

బాలాజీ రామకృష్ణ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు: సరస్వతీ దేవిగా అమ్మవారు

Updated : 16 Oct 2026 19:22 IST
As Preferred Source 1 min read
బాలాజీ రామకృష్ణ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు: సరస్వతీ దేవిగా అమ్మవారు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆరుట్ల లింగస్వామి కుటుంబ సభ్యులు

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

చౌటుప్పల్ మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆరుట్ల లింగస్వామి తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.​అనంతరం ఆరుట్ల లింగస్వామి మాట్లాడుతూ.. అమ్మవారి దివ్య ఆశీస్సులు సమాజంలోని ప్రజలందరికీ లభించి, ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు. దైవభక్తితో పాటు ప్రతి ఒక్కరూ మానవత్వం, ధర్మం, సేవాభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, పేదలకు అండగా నిలవడం, మహిళలను గౌరవించడం, పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో మెలగాలని కోరారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, ఆలయ పురోహితులు సంతోష్ శాస్త్రి, భక్తులు, భవాని మాలాధారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలాజీ రామకృష్ణ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు: సరస్వతీ దేవిగా అమ్మవారు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి