Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.

Updated : 16 Oct 2026 18:58 IST
As Preferred Source 1 min read
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి.   ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.

ఎల్బీనగర్, అక్టోబర్ 16 స్థానికం ప్రతినిధి:

నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జోనల్ కమిషనర్ వికాస్ మహాతోతో సమావేశమై వివిధ డివిజన్లలోని సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు.

రెండు రోజుల క్రితం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యే.. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అయ్యప్ప కాలనీలో డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఆటోనగర్ డంపింగ్ యార్డు పరిసరాల్లో చెత్తను తొలగించి, ఫుట్‌పాత్‌లు నిర్మించాలని కోరారు. సీసీ కెమెరాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు.

బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లోని వైదేహినగర్‌లో నూతన రోడ్లు నిర్మించాలని సూచించారు. హరిహరపురం, విజయపురి కాలనీలతోపాటు చంపాపేట డివిజన్‌లోని పవన్‌పురి కాలనీలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని స్పష్టం చేశారు.

త్వరలో పనులు ప్రారంభిస్తాం

అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపించామని జోనల్ కమిషనర్ వికాస్ మహాతో తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు వివరించారు.

Sthanikam

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి