రెండేళ్ల బాధ్యతలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 15: భువనగిరి డివిజన్లో డివిజనల్ ఇంజనీర్ (డీఈ)గా సంఘం వెంకటేశ్వర్లు రెండేళ్ల బాధ్యతలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఆర్. రవీందర్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల రాజేశ్వర్ కలిసి వెంకటేశ్వర్లుకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుర్గయ్య, యాదయ్య, మహేష్, మల్లేష్, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి