చౌటుప్పల్ 17వ వార్డులో చెత్తబుట్టలు, మొక్కల పంపిణీ
తడి, పొడి చెత్త వేర్వేరుగా ఆటోలకే ఇవ్వాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు
చెత్తను బహిరంగ ప్రదేశాలు, ఖాళీ ప్లాట్లలో వేస్తే మున్సిపల్ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ల సహకారంతో వార్డులో ప్రజలకు చెత్తబుట్టలు, మొక్కలను ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసి, రోజూ వచ్చే మున్సిపల్ చెత్త బండి (ఆటో)లోనే వేయాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో ప్లాస్టిక్ కవర్లలో చెత్త వేయడం వల్ల భూమి కలుషితమై తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. అలాగే ప్రతి ఇంట్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలన్నా, కాలుష్యం తగ్గాలన్నా చెట్లను పెంచడం ఆవశ్యకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు వీరమల్ల సత్తయ్య, నాయకులు ముత్యాల గణేష్ కుమార్, వెల్తూరి అంజయ్య, ఎండీ జవీద్, వెంకట్ రెడ్డి, మెట్టు రామచంద్రారెడ్డి, కల్లెట్ల రాజు, వెల్తూరి రాజు, ఇమ్మడి ఈశ్వర్, కూరెల్ల మహేశ్వరచారి, ఎస్కే ఉస్మాన్, తోటకూర లలిత, వీరమల్ల విజయ, మాదిరెడ్డి వాణి, కోట్ల విజయ, వెల్తూరి ఇందిర, సుక్క జ్యోతి, కుమారి, ముత్యాల మహాలక్ష్మి, నీలిమ, వెల్తూరి విజయలక్ష్మి, మహిళా సంఘం ఆర్పీ అంతటి అలివేలు, మున్సిపల్ సిబ్బంది హనుమాన్ ప్రసాద్, జవాన్ బోదుల నర్సింహ, రేణుకుమార్, వార్డు ఆఫీసర్ కిరణ్, హమీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి