ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన కమిటీ
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా వర్కాల వెంకట్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఆధ్వర్యంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసార్ల శ్రీనివాస్ రెడ్డి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి