నాగిరెడ్డిపల్లి: పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ క్రమంలో శుక్రవారం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రేషన్ కార్డు పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతోపాటు, అర్హతను బట్టి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నూతన రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ), గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి