Sthanikam - Truth Matters
Logo

యాసంగిలో వరి వేస్తే నష్టాలు తప్పవు!

Updated : 16 Oct 2026 17:42 IST
As Preferred Source 1 min read
యాసంగిలో వరి వేస్తే నష్టాలు తప్పవు!

బోర్లు, బావుల కింద వరి సాగు చేయొద్దు...

ఎల్‌నినో ప్రభావంతో ఎండుతున్న పంటలు.. రైతులకు ప్రత్యేక అధికారి దాసరి హరిచందన సూచన...

తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటల వైపు మళ్లాలి...

రైతులకు విత్తనాలు, ఇతర సహకారం అందిస్తాం...

నల్గొండ : ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే పరిస్థితులు ఉన్నందున రైతులు యాసంగి సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల కార్యదర్శి దాసరి హరిచందన సూచించారు. ముఖ్యంగా బోర్లు, బావుల కింద వరి వేయడం వల్ల భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పడటంతో పాటు విద్యుత్తు వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. పంట చేతికి అందకపోతే రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్కువ నీరు అవసరమయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం విత్తనాలు, ఇతర సహకారం అందిస్తుందని తెలిపారు.

ఎండిన వరి, పత్తి పొలాల పరిశీలన...

ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం, పంటలు, తాగునీరు, విద్యుత్తు తదితర రంగాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించేందుకు హరిచందన శుక్రవారం నల్గొండ జిల్లాకు వచ్చారు. అనంతరం కనగల్‌ మండలం శేరిలింగోటం గ్రామ పరిధిలో నీరు లేక ఎండిపోయిన వరి, పత్తి పొలాలను పరిశీలించారు. పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. అనంతరం గ్రామానికి చెందిన రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ముందే హెచ్చరించినం వరి సాగుతో నష్టం వస్తుందని..

ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు సరిగా కురిసే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం ముందుగానే రైతులను అప్రమత్తం చేశారని హరిచందన తెలిపారు. అయినప్పటికీ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేశారని పేర్కొన్నారు. పంట చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అడుగంటడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని, పత్తి పంటకూ నీటి ఎద్దడి ఎదురవుతోందని చెప్పారు. దీంతో రైతులు పెట్టుబడులు కోల్పోయి నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నీరు, విద్యుత్తు వృథా.. రైతుపై అదనపు భారం...

ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయడం వల్ల భూగర్భ జలాలను అధికంగా వినియోగించాల్సి వస్తుందని, బోర్లు, బావుల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుందని ప్రత్యేక అధికారి వివరించారు. నీటి కొరతతో పంట దిగుబడి తగ్గినా, పూర్తిగా ఎండిపోయినా రైతు తీవ్రంగా నష్టపోతాడని చెప్పారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో బోర్లు, బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

తోటి రైతులను అప్రమత్తం చేయాలి...

పంటలు ఎండిపోవడం వల్ల ఎదురైన నష్టాలను స్వయంగా అనుభవించిన రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవాలని హరిచందన కోరారు. మరో రైతు కూడా ఇలాంటి నష్టాన్ని ఎదుర్కోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. శేరిలింగోటం గ్రామ రైతులే కాకుండా ఇతర ప్రాంతాల రైతులకూ నీటి లభ్యత, పంటల ఎంపికపై వాస్తవ పరిస్థితులను వివరించాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ నీటి వనరులకు అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వ సహకారం...

తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటలను ఎంచుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని హరిచందన సూచించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావాలని, అవసరమైన విత్తనాలు, ఇతర సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో నల్గొండ జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌ కుమార్‌, ఉద్యాన శాఖ అధికారి శేఖర్‌, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు), ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

యాసంగిలో వరి వేస్తే నష్టాలు తప్పవు!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి