Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Updated : 16 Oct 2026 18:28 IST
As Preferred Source 1 min read
బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్ పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెరువు కట్టపై విద్యుద్దీపాలంకరణ, బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద ఏర్పాట్లు, భద్రత కోసం బారికేడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసారి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా 32 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పూల అలంకరణ, లైటింగ్ టవర్లు, భారీ తెరలు, లేజర్ లైటింగ్‌తో చెరువు కట్టను అందంగా ముస్తాబు చేస్తున్నారు. నిమజ్జనం కోసం రెండు ఘాట్లను సిద్ధం చేస్తుండగా, పరిసరాలను శుభ్రం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను నిర్మలా జగ్గారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.

Sthanikam

బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

Article Image

సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్ పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెరువు కట్టపై విద్యుద్దీపాలంకరణ, బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద ఏర్పాట్లు, భద్రత కోసం బారికేడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసారి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా 32 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పూల అలంకరణ, లైటింగ్ టవర్లు, భారీ తెరలు, లేజర్ లైటింగ్‌తో చెరువు కట్టను అందంగా ముస్తాబు చేస్తున్నారు. నిమజ్జనం కోసం రెండు ఘాట్లను సిద్ధం చేస్తుండగా, పరిసరాలను శుభ్రం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను నిర్మలా జగ్గారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి