భువనగిరి: నందనంగ్రామంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మట్ట అంజయ్య, కార్యవర్గ సభ్యులు శుక్రవారం భువనగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు మట్ట అంజయ్యతో పాటు కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మట్ట శంకర్ బాబు, మాజీ సర్పంచ్ నాగిని సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండాపురం గణేష్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండాపురం చంద్రమౌళి, గౌడ సంఘం అధ్యక్షుడు మట్ట బాలరాజ్, మట్ట సైదులు, సిద్ధగోని వెంకటేష్, నాగయ్య, రచ్చ మహేష్, పోవనపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి