Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / మేడ్చెల్ మల్కాజ్‌గిరి

మల్కాపురం ఐటీ పార్కులో గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి

Updated : 16 Oct 2026 18:28 IST
As Preferred Source 1 min read
మల్కాపురం ఐటీ పార్కులో గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి

​మరో యువకుడికి తీవ్ర గాయాలు

మృతుడు బీహార్‌కు చెందిన కార్మికుడిగా గుర్తింపు

యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని మల్కాపురం గ్రామంలోగల ఐటీ పార్కులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ ప్రాంగణంలో ఉన్న 'ఆక్సి నౌ మెడికల్ ఇండస్ట్రియల్ గ్యాసెస్' కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ప్రస్తుతం మల్కాపురం గ్రామంలోనే నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు.​ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామానికి చెందిన మాథరి హరిప్రసాద్ (23) అనే మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

మల్కాపురం ఐటీ పార్కులో గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి