ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు
పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: నాయకులు
చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన కార్యవర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసిన నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి అభినందనలు అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి అందరం సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ అధ్యక్షుడు మొగుదాల రమేష్ గౌడ్, జనరల్ సెక్రెటరీలు ఇప్ప వెంకటేష్, ఎర్రగోని లింగస్వామి, ఉపాధ్యక్షులు అంతటి విజయలక్ష్మి బాలరాజు, బండమీది మల్లేష్, సయ్యద్ వాయుద్దీన్, చెరుకు లింగస్వామి, వర్కాల వెంకట్ కుమార్, సెక్రెటరీలు గుండెబోయిన మనిత ఐలయ్య యాదవ్,ఓర్సు శ్రీజా రాజు, మహమ్మద్ ఫిరోజ్, మట్టుపల్లి యాదగిరి, మాదాని గోపాల్, బత్తుల రాజు, జక్కర్తి సుధా, పేరుపల్లి సుమతి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి