Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:01 PM

ఆలయ దొంగతనాలకు చెక్‌.. నిందితుడి అరెస్ట్‌. రూ.11,200 నగదు, పూజా సామగ్రి, వాహనం స్వాధీనం

17-08-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17: జిల్లాలో వరుసగా ఆలయాలను టార్గెట్‌ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు యాదాద్రి-భువనగిరి జిల్లా పోలీసులు. మోతకొండూర్, గుండాల, వలిగొండ, ఆత్మకూర్‌(ఎం) పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన ఆలయ దొంగతనాల కేసులను ఛేదించి ఒక నిందితుడిని అరెస్ట్‌ చేశారు. మరో సీసీఎల్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వాహన తనిఖీల్లో పట్టుబడి..

తిమ్మాపూర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నంబర్‌ ప్లేట్‌ లేని టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు. వాహనంపై ఉన్న బండారి దుర్గాప్రసాద్‌ (23)ను అదుపులోకి తీసుకుని విచారించగా జిల్లాలోని పలు ఆలయాల్లో చేసిన దొంగతనాల గుట్టు విప్పాడు.

ఆలయ సామగ్రి భారీగా రికవరీ

నిందితుడి నుంచి రూ.11,200 నగదు, టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనం, రెండు పెద్ద ఆలయ గంటలు, ఐదు మధ్యస్థాయి గంటలు, శతగోపములు, హారతి ప్లేట్లు, కలశాలు, రాగి పాత్రలు, గోపురం కలశాలు, గోపురం ప్లేట్లు, బంగారు, వెండి వస్తువులు తదితర ఆలయ పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఉపయోగించిన స్పానర్లు, స్క్రూడ్రైవర్లు, ఇనుప రాడ్‌ తదితర పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

రెక్కీ చేసి.. స్క్రాప్‌ దుకాణాలకు అమ్మకాలు

జనసంచారం తక్కువగా ఉండే గ్రామ శివార్లలోని ఆలయాలను ముందుగా రెక్కీ చేసి నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన ఆలయ సామగ్రిని వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టి.. అనంతరం స్క్రాప్‌ దుకాణాల్లో విక్రయించేవారని తెలిపారు.

పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు

ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, చౌటుప్పల్‌ డీఎస్పీ పి. మధుసూదన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో, రామన్నపేట ఇన్‌స్పెక్టర్‌ ఎం. రవి పర్యవేక్షణలో సీసీఎస్‌ భువనగిరి సహకారంతో ఆత్మకూర్‌(ఎం) ఎస్‌ఐ ఎన్‌. లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి కేసులను ఛేదించారు.

పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.

పరారీలో ఉన్న సీసీఎల్‌ను పట్టుకోవడంతో పాటు నిందితుడి ప్రమేయం ఉన్న ఇతర కేసులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలయ నిర్వాహకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Sthanikam

ఆలయ దొంగతనాలకు చెక్‌.. నిందితుడి అరెస్ట్‌. రూ.11,200 నగదు, పూజా సామగ్రి, వాహనం స్వాధీనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News