నాగల్గిద్ద మండలం ఔదత్పూర్ గ్రామంలోని ప్రభుత్వ సీలింగ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం డిమాండ్ చేశారు. సోమవారం నాగల్గిద్ద మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఔదత్పూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 12, 15లో ఉన్న విలువైన ప్రభుత్వ సీలింగ్ భూములను కొందరు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూమి అని తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్లకు సహకరించిన అధికారులు, దళారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై గతంలోనే జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఆధారాలతో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరఫున కమిషన్ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని అబ్దుల్ రహీం హెచ్చరించారు.
సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలి: అబ్దుల్ రహీం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి