Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

55 పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా జాబితా.

18-08-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 95-నకిరేకల్‌ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండల ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ విడుదల చేశారు. మండలంలోని 55 పోలింగ్‌ కేంద్రాల్లో సంబంధిత బూత్‌ లెవెల్‌ అధికారులు జాబితాలను ప్రచురించారు.

చిట్యాల మండలంలో మొత్తం 44,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 22,256 మంది పురుషులు, 22,513 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఓటర్లు తమ పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేదో సంబంధిత పోలింగ్‌ కేంద్రం, బీఎల్‌ఓల వద్ద లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలనిసూచించారు.అర్హత కలిగిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6, పేరు తొలగింపునకు ఫారం-7, పేరు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో మార్పులకు ఫారం-8 సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత బీఎల్‌ఓలకు లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓ అధికారులకు సమర్పించవచ్చని తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Sthanikam

55 పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా జాబితా.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News