Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

జాతీయ గీతాన్ని అవమానించడం తగదు

జాతీయ గీతాన్ని అవమానించడం తగదు

జాతీయ గీతాన్ని అవమానించడం తగదు
18-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘వందేమాతరం’ ఆలపించి నిరసన

కాంగ్రెస్ నాయకులు ‘వందేమాతరం’ గీతాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక తంగడపల్లి రోడ్డులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం బీజేవైఎం మండల అధ్యక్షుడు పబ్బు వంశీ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని రగిలించిన వందేమాతరం గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. జాతీయ చిహ్నాలు, గీతాలను రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్య సమరయోధుల విలువలు, దేశభక్తిని అందించాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, సీనియర్ నాయకులు రమణ గోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, బత్తుల జంగయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురేష్, చిరంజీవి, పోలేపల్లి లక్ష్మి, ఉడుగు వెంకటేశం, బీజేవైఎం నాయకులు నాగార్జున, శరత్ కుమార్, గౌతమ్, ప్రకాష్, కార్తీక్, సన్నీ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ గీతాన్ని అవమానించడం తగదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News