Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

టీబీ రహిత మనూర్‌ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్

18-08-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్‌ మండలాన్ని టీబీ రహిత మండలంగా మార్చే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మనూర్‌ గ్రామంలో ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్‌ నిర్వహించారు. దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ అనుమానిత లక్షణాలు ఉన్న 45 మందికి ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను త్వరగా గుర్తించి ఉచిత చికిత్స, అవసరమైన పోషకాహారం అందించడమే క్యాంప్‌ ఉద్దేశమని వైద్యాధికారి డాక్టర్‌ స్టాలిన్‌ తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ఇలాంటి టీబీ పరీక్షా శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

Sthanikam

టీబీ రహిత మనూర్‌ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్‌ మండలాన్ని టీబీ రహిత మండలంగా మార్చే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మనూర్‌ గ్రామంలో ప్రత్యేక ఎక్స్‌రే క్యాంప్‌ నిర్వహించారు. దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి టీబీ అనుమానిత లక్షణాలు ఉన్న 45 మందికి ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను త్వరగా గుర్తించి ఉచిత చికిత్స, అవసరమైన పోషకాహారం అందించడమే క్యాంప్‌ ఉద్దేశమని వైద్యాధికారి డాక్టర్‌ స్టాలిన్‌ తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ఇలాంటి టీబీ పరీక్షా శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News