Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

18-08-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్‌గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ సబ్‌ కలెక్టర్ ఉమా హారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, విద్య, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పాఠశాలల్లో మౌలిక వసతులు తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.తాగునీరు, విద్యుత్ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని, పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News