Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:59 PM

ఐఎస్‌బీని సందర్శించిన హయత్‌నగర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు.

19-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కెరీర్‌ అవకాశాలపై అవగాహన.

హయత్‌నగర్‌ స్థానికం ప్రతినిధి :

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు విద్యా విహారయాత్ర నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)ను బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పి. సురేష్‌బాబు అనుమతి, ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఐఎస్‌బీ ఎక్స్‌టర్నల్‌ రిలేషన్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ భగవతుల విద్యార్థులతో మాట్లాడారు. ఐఎస్‌బీ విద్యా వాతావరణం, మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాధాన్యత, ఉన్నత విద్య, భవిష్యత్‌ కెరీర్‌ అవకాశాలపై వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, వి.ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డా. మధు ధర్మపురి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డా. బి.నరసింహ, డా. సంతోషం పాల్గొన్నారు. అలాగే డా. డి.మక్లా, డా. పి.విజయలక్ష్మి, పి.విద్యాసాగర్‌, డా. వి.కృష్ణమోహన్‌, డా. జి.ప్రవీణ్‌కుమార్‌ విద్యార్థులతో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.

ప్రముఖ విద్యాసంస్థను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య, కెరీర్‌ అవకాశాలపై అవగాహన పెరిగిందని కళాశాల అధ్యాపకులు తెలిపారు.

Sthanikam

ఐఎస్‌బీని సందర్శించిన హయత్‌నగర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News