కోదాడలో చెక్ బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గోపతి నాగేంద్రమ్మకు కోదాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జీ మంగళవారం ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. రూ.13 లక్షల రుణానికి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు మట్టపల్లి రావు కోర్టును ఆశ్రయించారు. నోటీసులకు స్పందన లేకపోవడంతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువైంది. బాకీ చెల్లించని పక్షంలో అదనపు శిక్ష విధిస్తామని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
చెక్ బౌన్స్ కేసులో ఉపాధ్యాయురాలుకి జైలు శిక్ష
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి