Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఫోక్‌ ఆర్టిస్టులు?

19-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఈశ్వర్‌ సాయి, మాధురి రాథోడ్‌ ఒకే గదిలో.. వేములవాడలో అర్ధరాత్రి హైడ్రామా.

వేములవాడ: ఫోక్‌ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్‌ సాయి, మాధురి రాథోడ్‌ పేర్లు ప్రస్తుతం వివాదంలో వినిపిస్తున్నాయి. వేములవాడలోని ఓ భవనంలో అర్ధరాత్రి సమయంలో వీరిద్దరూ ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్‌ సాయి భార్య అక్కడికి చేరుకుని వారిని నిలదీసినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్తతో మాధురి రాథోడ్‌ సన్నిహితంగా ఉంటున్నారంటూ ఈశ్వర్‌ సాయి భార్య ఆరోపించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వీడియోలో కనిపించిన పరిస్థితుల ఆధారంగా వారి మధ్య వ్యక్తిగత సంబంధాన్ని నిర్ధారించలేమని పలు కథనాలు పేర్కొన్నాయి.ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ప్రమీల’ ఫోక్‌ సాంగ్‌లో ఈశ్వర్‌ సాయి, మాధురి రాథోడ్‌ కలిసి నటించారు. వీరిద్దరూ గతంలోనూ పలు ఫోక్‌ సాంగ్స్‌లో జోడీగా కనిపించారు. ‘రాతిరి రాతిరి రాతిరిలో’ వంటి పాటలతోనూ గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో ఫోక్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తు, ఇరువర్గాల వాదనలు వెలుగులోకి వస్తేనే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Sthanikam

భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఫోక్‌ ఆర్టిస్టులు?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News