Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి

19-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలను రాజకీయ జోక్యం లేకుండా నిజమైన అర్హులైన లబ్ధిదారులకే అందించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింలు డిమాండ్ చేశారు. పేద, నిరుద్యోగ ఎస్సీ కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, సిఫారసులతో అర్హత లేని వారికి మంజూరు చేయడం వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయ జోక్యంతో అర్హత లేని వారికి రుణాలు మంజూరు చేస్తే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని, అవసరమైతే మండల అభివృద్ధి కార్యాలయాలు, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామని నర్సింలు హెచ్చరించారు. వెంటనే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు ఎస్. గణపతి, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News