కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేయడమే సంఘటన్ సృజన్ అభియాన్ ప్రధాన లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్‌చెరు నియోజకవర్గంలోని అశోక్‌నగర్ సితార హోటల్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతంపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, ప్రతి కార్యకర్తకు గౌరవం, ప్రతి నాయకుడికి బాధ్యత, అందరి మధ్య సమన్వయం ఉంటే పార్టీ మరింత బలపడుతుందని నీలం మధు అన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పదాధికారులు, మండల–బ్లాక్ అధ్యక్షులు తదితరుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా పార్టీ భవిష్యత్ సంస్థాగత నిర్మాణానికి మంచి దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదతో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి గ్రామం.. ప్రతి వార్డులో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి