Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

లో వోల్టేజీపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

లో వోల్టేజీపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

లో వోల్టేజీపై బీఆర్‌ఎస్‌ పోరుబాట
20-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ ఎస్‌ఈ కార్యాలయం ముట్టడి.. రైతులతో కలిసి నిరసనకు దిగిన చిరుమర్తి లింగయ్య.

నల్లగొండ: రైతులను వేధిస్తున్న లో వోల్టేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు గురువారం నల్లగొండ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించాయి. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతులతో కలిసి చిరుమర్తి లింగయ్య కాలిపోయిన బోరు మోటర్లు, ఎండిపోయిన వరి పంటలను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోవడంతోపాటు పంటలకు సక్రమంగా నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.లో వోల్టేజీ సమస్యతో ఎండిపోయిన రైతుల పంటలకు ప్రభుత్వమే పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు కోతలు లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని, విద్యుత్‌ సమస్యల కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు హెచ్చరించారు.

Sthanikam

లో వోల్టేజీపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News