Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:02 PM

దివ్యాంగుల ఉద్యోగాలకు ‘స్పెషల్‌ డ్రైవ్‌’..జీవో పునరుద్ధరణపై హర్షం.. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

20-08-2026 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: దివ్యాంగుల ఉద్యోగ నియామకాల్లో కీలక ముందడుగు పడింది. దివ్యాంగుల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ రిక్రూట్‌మెంట్‌ జీవోను పునరుద్ధరించడంపై విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో ఫోరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక నియామక ప్రక్రియ పునరుద్ధరణతో ప్రభుత్వ శాఖల్లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి మార్గం సుగమం కానుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. వేలాది మంది దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై ఆశలు చిగురించాయని తెలిపారు.

కృషి చేసిన వారికి కృతజ్ఞతలు

స్పెషల్‌ డ్రైవ్‌ జీవో పునరుద్ధరణకు కృషి చేసిన మంత్రి అట్లూరి లక్ష్మణ్, మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిత రామచంద్రన్, ప్రస్తుత దివ్యాంగుల ప్రిన్సిపల్‌ సెక్రటరీ శృతి ఓజ, చెరుకు నాగభూషణం, పి. వెంకటేశ్వర్లులకు ఫోరం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమం, విద్య, ఉపాధి, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. ప్రత్యేక నియామక ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి పెండింగ్‌ బ్యాక్‌లాగ్‌ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. అశోక్, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారవేణి చంద్రశేఖర్‌ యాదవ్, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కుర్షిత్‌ మియా, మహిళా అధ్యక్షురాలు ధనమ్మ, కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, శివ యాదవ్, అరవింద్తో పాటు దివ్యాంగ విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల ఉద్యోగాలకు ‘స్పెషల్‌ డ్రైవ్‌’..జీవో పునరుద్ధరణపై హర్షం.. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News