Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:59 PM

హయత్‌నగర్ కళాశాల గ్రంథపాలకుడికి జాతీయ అవార్డు

20-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డాక్టర్‌ ఆనందం దుర్గాప్రసాద్‌కు ఘన సన్మానం

హయత్‌నగర్: మద్రాస్‌ లైబ్రరీ అసోసియేషన్‌ అందించే జాతీయ స్థాయి ఉత్తమ లైబ్రేరియన్‌ అవార్డు అందుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌ గ్రంథపాలకుడు డాక్టర్‌ ఏ. ఆనందం దుర్గాప్రసాద్‌ను కళాశాల స్టాఫ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. సురేష్‌బాబు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆయనను అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. సురేష్‌బాబు మాట్లాడుతూ.. దుర్గాప్రసాద్‌ రూపొందించిన ‘ఈ-లైబ్రరీ తెలంగాణ’ బ్లాగ్‌ విద్యార్థులకు విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారానికి విశ్వసనీయ వేదికగా మారిందన్నారు. ఎక్కడా సులభంగా లభించని విద్యా, ఉద్యోగ సమాచారాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచుతూ వారి లక్ష్య సాధనకు తోడ్పడుతున్నారని కొనియాడారు.

అవార్డు గ్రహీత డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. “ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ ఫర్‌ ఆల్‌” లక్ష్యంతో బ్లాగ్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం 146 దేశాల నుంచి పాఠకులు ఈ బ్లాగ్‌ను వీక్షిస్తున్నారని, వివిధ దేశాల నుంచి సుమారు 17 లక్షల మంది సందర్శించారని చెప్పారు. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, గత ప్రశ్నపత్రాలు, సమాధానాలు, ప్రాక్టీస్‌ బిట్స్‌, వీడియో పాఠాలు, అధ్యయన సామగ్రి ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

కోచింగ్‌ లేకుండానే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యార్థులకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నామని, ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

స్టాఫ్‌ క్లబ్‌ కార్యదర్శి డాక్టర్‌ శ్రీపతి నాయుడు మాట్లాడుతూ.. దుర్గాప్రసాద్‌కు జాతీయ స్థాయి అవార్డు రావడం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌కు గర్వకారణమన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్స్‌ వెంకట శ్రీనివాస్‌రెడ్డి, శ్రీమతి ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మధు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బి. నరసింహ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఈ. యాదగిరిరెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

హయత్‌నగర్ కళాశాల గ్రంథపాలకుడికి జాతీయ అవార్డు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News