Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:04 PM

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాస్తారోకో.అబ్దుల్లాపూర్‌మెట్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పలువురికి గాయాలు

20-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్‌: జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు అబ్దుల్లాపూర్‌మెట్‌ జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ఆందోళనలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్‌ 97ను రద్దు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎస్ఎఫ్‌ఏ నాయకులు గుండే శివకుమార్, శశితో పాటు విద్యార్థులు పునీత్, గౌస్, జస్వంత్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

Sthanikam

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాస్తారోకో.అబ్దుల్లాపూర్‌మెట్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. పలువురికి గాయాలు

Article Image

అబ్దుల్లాపూర్‌మెట్‌: జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు అబ్దుల్లాపూర్‌మెట్‌ జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. ఆందోళనలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్‌ 97ను రద్దు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎస్ఎఫ్‌ఏ నాయకులు గుండే శివకుమార్, శశితో పాటు విద్యార్థులు పునీత్, గౌస్, జస్వంత్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News