Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

శివసాయి వెంచర్‌లో ఓపెన్‌ స్పేస్‌ పరిశీలన.. కబ్జాలకు చెక్‌!

20-08-2026 204 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

2,299 చదరపు గజాల మున్సిపల్‌ స్థలం గుర్తింపు.. రక్షణకు చర్యలు.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు శివనేనిగూడెం రోడ్డులో ఉన్న శివసాయి వెంచర్‌లో మున్సిపాలిటీకి గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా దఖలైన ఓపెన్‌ స్పేస్‌ను అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓపెన్‌ స్పేస్‌ను కొందరు ఆక్రమిస్తున్నారంటూ యువశక్తి యూత్ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు.

మున్సిపల్‌ కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ (టీపీఎస్‌), అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), సంబంధిత వార్డు అధికారి స్థలాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా గిఫ్ట్‌ డీడ్‌, రిజిస్ట్రేషన్‌ పత్రాలను అధికారులు పరిశీలించడంతో పాటు స్థలాన్ని క్షేత్రస్థాయిలో కొలిచారు.

ఆమోదిత లేఅవుట్‌ ప్రకారం గిఫ్ట్‌ డీడ్‌లో చూపించిన 10 శాతం ఓపెన్‌ స్పేస్‌ విస్తీర్ణం 2,299 చదరపు గజాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

మున్సిపల్‌ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం.

ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించిన ఓపెన్‌ స్పేస్‌లను పరిరక్షించేందుకు మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. మున్సిపల్‌ ఆస్తుల రక్షణకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిల్‌ సభ్యులు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. సంబంధిత రికార్డులు, నిబంధనలను పరిశీలించిన అనంతరం ఓపెన్‌ స్పేస్‌కు కంచె ఏర్పాటు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అలాగే సదరు స్థలానికి రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్లగొండ సబ్‌ రిజిస్ట్రార్‌కు లేఖ ద్వారా సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన స్థలాల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలకు తావులేకుండా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

శివసాయి వెంచర్‌లో ఓపెన్‌ స్పేస్‌ పరిశీలన.. కబ్జాలకు చెక్‌!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News