Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

రెడీమిక్స్‌ ప్లాంట్‌ ఏర్పాటును రద్దు చేయాలి

20-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పంట పొలాలు, రైతుల జీవనోపాధికి ముప్పు.. తహసీల్దార్‌కు వినతిపత్రం.

చిట్యాల: మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే రెడీమిక్స్‌ ప్లాంట్‌ ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని కోరుతూ స్థానిక రైతులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్లాంట్‌ ఏర్పాటుతో పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు, రైతుల జీవనోపాధితో పాటు ప్రజల ఆరోగ్యం, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెడీమిక్స్‌ ప్లాంట్‌ నుంచి వెలువడే సిమెంట్‌, ఇసుక, రాళ్ల దుమ్ముతో గాలి కాలుష్యం ఏర్పడి పంటలపై దుమ్ము పేరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో పంట దిగుబడులు తగ్గి సుమారు వంద మంది రైతుల ప్రత్యక్ష జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అలాగే ప్లాంట్‌కు భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో గ్రామీణ రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రజలు, విద్యార్థులు, రైతులకు ప్రమాదాల ముప్పు ఉంటుందని తెలిపారు. ప్లాంట్‌ నిర్వహణలో వెలువడే వ్యర్థాలు, మురుగునీరు వ్యవసాయ భూములు లేదా నీటి వనరుల్లోకి చేరితే నేల, నీటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కలెక్టర్‌ స్థాయిలో పరిశీలించాలి

రెడీమిక్స్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ స్వయంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని రైతులు కోరారు. పంట పొలాలకు, ప్రజల జీవనానికి ఎలాంటి నష్టం కలగకుండా సమగ్రంగా పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్లాంట్‌ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో గంట్ల మహేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గుత్తా లవకుమార్‌, పున్న రాజు, యాదగిరి, విరమల్లు, లింగారెడ్డి, ముత్తయ్య, రాములు, రవి తదితర రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రెడీమిక్స్‌ ప్లాంట్‌ ఏర్పాటును రద్దు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News