Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బోనాల వేడుకలు

20-08-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అలరించిన పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు

స్థానిక శ్రీ గాయత్రి జూనియర్, డిగ్రీ కళాశాలలో బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అలకరించిన బోనాలతో విద్యార్థినులు ఊరేగింపుగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలతో కళాశాల పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోనాలు ప్రకృతిని, శక్తిని పూజించే గొప్ప సంప్రదాయమని కొనియాడారు. విద్యార్థులు విద్యతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. వేడుకలను ప్రశాంత వాతావరణంలో, క్రమశిక్షణతో నిర్వహించిన యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల కరెస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి, చైర్మన్ బండారు మయూరి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో నైతిక విలువలు, పాశ్చాత్య ధోరణులను అధిగమించి సాంప్రదాయాల పట్ల గౌరవం పెంచేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ దయాకర్, ఆంజనేయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బోనాల వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News