గ్రామ పంచాయతీ కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు
శాలువాలు, పూలమాలలతో హీనా బేగం కు విఓ ఒబి (VO OB) సభ్యుల ఘన సన్మానం
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల పరిధిలోని ఎస్గి గ్రామ చరిత్రలో సరికొత్త సువర్ణాక్షరాల ఘట్టం ఆవిష్కృతమైంది. ఎస్గి గ్రామ సంఘం (VO) అధ్యక్షురాలిగా, అలాగే నాగల్గిద్ద మండల మహిళా సమైక్య అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతిభాశాలి హీనా బేగం ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక 'స్త్రీనిధి' ఉమ్మడి జిల్లా డైరెక్టర్ ఎన్నికల్లో పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఈ అఖండ విజయం పట్ల మండల వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, గురువారం (20/08/2026)నాడు ఎస్గి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సంఘం ఒబి (OB) సభ్యులు మరియు మహిళా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో హీనా బేగం కు బ్రహ్మరథం పట్టారు. గ్రామ పంచాయతీ వేదికగా ఆమెకు శాలువా కప్పి, పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందించి అత్యంత ఘనంగా సన్మానించారు. మిఠాయిలు పంచుకుంటూ గ్రామ పంచాయతీ ఆవరణలో పండగ వాతావరణాన్ని తలపించేలా సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ...
హీనా బేగం ఉమ్మడి జిల్లా స్థాయి డైరెక్టర్‌గా గెలవడం తమ ఎస్గి గ్రామానికి మరియు నాగల్గిద్ద మండలానికి దక్కిన అత్యున్నత గౌరవమని కొనియాడారు. మహిళల సంక్షేమం కోసం, పొదుపు సంఘాల బలోపేతం కోసం ఆమె ఎల్లప్పుడూ ముందుంటారని, ఈ కొత్త పదవితో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగం మాట్లాడుతూ...
తనపై నమ్మకంతో గెలిపించిన ఉమ్మడి జిల్లా ఓటర్లకు, ఈరోజు తనను సొంత గ్రామంలో ఇంతటి ఘనంగా సత్కరించిన ఎస్గి గ్రామ సంఘ సభ్యులకు, మహిళా లోకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ఆర్థిక స్వాలంబన కోసం, స్త్రీనిధి పథకాల ద్వారా ప్రతి పేద మహిళకు లబ్ధి చేకూర్చడం కోసం ఒక సైనికురాలిలా నిరంతరం శ్రమిస్తానని ఆమె ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
ఈ అద్భుతమైన సన్మాన వేడుకలో గ్రామ సంఘం (VO) ఒబి సభ్యులు సంగీత , కలావతి, రాములు సీసీ, వివిధ మహిళా సంఘాల లీడర్లు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హీనా బేగానికి శుభాకాంక్షల వర్షం కురిపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి